25.7 C
Hyderabad

ఇసుక అక్రమ రవాణా ఆగేదెన్నడో..?

Must read

📰 Generate e-Paper Clip

  •  అభివృద్ధి పనుల పేరిట జోరుగా ఇసుక అక్రమ రవాణా
  •   వే బిల్లులు ఒక వైపు డంపింగ్ లు మరోవైపు
  •  పట్టించుకోని అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ: అభివృద్ధి పనుల పేరిట అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. అక్రమ ఇసుక రవాణా ఆగేదేన్నడోనని పలువురు వాపోతున్నారు. ఒక ట్రాక్టర్‌కు అనుమతి ఉండగా మూడు నుంచి నాలుగు ట్రాక్టర్ లు  ఒకే వేబిల్ తో ఉదయం నుండి సాయంత్రం వరకు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇసుక ట్రాక్టర్ లకు అనుమతి ఇవ్వడంతో దీనిని ఆసరా చేసుకుని ఇసుక మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. పోతంగల్ మండలం మంజీరా నది నుండి సుంకిని గ్రామం, రుద్రూర్ గ్రామం

Will illegal sand trafficking ever stop?

మీదుగా వర్ని, చందూర్ వైపుకు అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. సీసీ రోడ్ల పనుల పేరిట వే బిల్లులు తీసుకొని రుద్రూర్ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఓ ఇంటి నిర్మాణానికి సుమారు 10 ట్రాక్టర్ ట్రిప్పుల డంపులు వేస్తున్నారు. ఇలా ప్రభుత్వ పనుల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్న కూడా అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని పలు విమర్శలు వెలువేత్తుతున్నాయి. సిసి రోడ్లు, ప్రభుత్వ పనుల పేరిట ప్రతిరోజు పదుల సంఖ్యలో జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

Will illegal sand trafficking ever stop?

More articles

Latest article