27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆప్షన్ ఎందుకు అడిగినట్టు?

Must read

📰 Generate e-Paper Clip

. డీ ఈ కి నచ్చిన చోటనే పోస్టింగ్

నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ ఉద్యోగుల బదిలీల జాబితాలో పేరు ఉన్నవారు సెక్షన్ ఆప్షన్ పెట్టుకోవాలని కంపెనీ సీఎండీ సూచించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు దీనికి అనుగుణంగా ఒక్కొక్కరు ఐదు ఆప్షన్లు ఇచ్చారు. కొందరికి కోరుకున్నచోట పోస్టింగ్ ఇస్తే ఇంకొందరికి డీఈ ల ఇష్టప్రకారమే ఉత్తర్వులు వెలువడడం చర్చనీయాంశమైంది. ఇదేమని అడిగితే ఎక్కడైనా ఇచ్చే అధికారం మాకు ఉందనే సమాధానాలు బదిలీ చేసిన అధికారుల నుంచి వచ్చాయని ఉద్యోగులు వాపోతున్నారు.

ఆప్షన్ అడగడం ఎందుకు

ఉద్యోగి సౌలభ్యం కోసం ఆప్షన్ అడిగిన సంస్థ, దాని ప్రకారమే బదిలీ చేయాలని సూచించింది. ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) సిబ్బందికి వెబ్ ఆప్షన్ ఇవ్వలేదు. డివిజన్ డీఈ కి రాసిచ్చిన ఆప్షన్ అనుసరించి పోస్టింగ్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువమంది అవే ఆప్షన్స్ ఇస్తే జాబితాలో ముందున్నవారికి ముందే పోస్టింగ్ ఇవ్వాలి. ముందు వరుసలో ఉన్నవారు ఇచ్చినవి కాకుండా డీఈ సొంత నిర్ణయంపై బదిలీ చేశారు. ఇష్టారీతిన  ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆప్షన్ అడగడం ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్మూర్ డివిజన్ లో..

ఈ డివిజన్ లో సిబ్బంది పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం కొందరికి ఇచ్చారు. ఇంకొందరిని ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. బదిలీల జాబితాలో 74 మంది ఉండగా ముందుగా 50 మందికి ఎంచుకున్న విధంగా పోస్టింగ్ ఇచ్చారు.  24 మందిని కౌన్సిలింగ్ కు రావాలని చెప్పి 16 ఖాళీలను చూపారు. వారు ఎంచుకున్న ఆప్షన్ ను పక్కనపెట్టి బదిలీ ఉత్తర్వులు చేతుల్లో పెట్టారు. దీనిలోనూ క్రమ సంఖ్యను అనుసరించి ఇవ్వకుండా యూనియన్ నాయకులు సూచనల మేరకు బదిలీలు చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. జాబితాలో పది లోపు ఉన్న ఉద్యోగి ఎంచుకున్న ఆప్షన్స్ ను పక్కన పెట్టేశారు. గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆరోగ్యం సహకరించని స్థితిలో ఉన్న ఓ ఉద్యోగి తనకు డివిజన్లో ఎక్కడైనా సరే సబ్ స్టేషన్ కావాలని అడగగా, ఆయన అభ్యర్థనను పట్టించుకోకుండా రెంజర్ల గ్రామానికి బదిలీ చేశారు.

 నిజామాబాద్ లో

నూత్ పల్లి సెక్షన్ లో పని చేస్తున్న లైన్ మెన్ కంపెనీ సూచన మేరకు ఆప్షన్ ఇవ్వగా, అవేవీ పట్టించుకోకుండా డీఈ ఆంధ్ర నగర్ కు బదిలీ చేశారు. జాబితాలో ఇతని కన్నా వెనుక ఉన్న  మెంట్రాజ్ పల్లి లైన్ మెన్ నిజామాబాద్ ఆప్షన్ ఇవ్వగా.. అతని కోరుకున్న చోటికి బదిలీ చేశారు.

More articles

Latest article