- ఎల్ సీ ఇచ్చాం.. ఎల్ సీ ఇవ్వలేదు
- నర్సింగ్ పల్లిలో కరెంట్ షాక్ తో కూలీకి తీవ్ర గాయాలు
- తమ తప్పేమి లేదంటున్న కరెంట్ అధికారులు
- సీఎండీకి ఫిర్యాదు చేస్తానంటున్న కాంట్రాక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : కరెంట్ అధికారులు ఫీల్డ్ లో లేకున్నా.. స్థానికంగా ఉండకపోయినా ఇస్తున్న ఎల్ సీ లు ప్రాణాలను బలికోరుతున్నాయి. కొన్నిసార్లు ప్రజలవి అవుతుండగా, మరికొన్ని సార్లు ఉద్యోగులవి, మరికొన్నిసార్లు ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్లవి అవుతున్నాయి. ఎదైన ప్రమాధం జరిగితే తమ తప్పేమి లేదని విద్యుత్ శాఖాధికారులు ఇతరులపైకి తోసేసి ( ఎల్ సి) ఇవ్వలేదని తప్పించుకుంటున్నారు. దానితో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కోన్ని లో లోపలనే సర్ధుబాటు చేసుకోని బటయకు పోక్కనివ్వడం లేదు..ఈ నెల మొదటి వారంలో బోధన్ మండలం రాజీవ్ నగర్ తాండలో ఎల్ సీ తీసుకోకుండా పోల్ ఎక్కిన అసిస్టెంట్ లైన్ మెన్ కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే మోపాల మండలంలోని నర్సింగ్ పల్లి వద్ద ఈ నెల 22న విద్యుత్ స్తంబాలు అకాల వర్షానికి నేలకోరిగాయి. వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా మరమ్మత్తులు చేయిస్తుండగా లైన్ క్లియర్ (ఎల్ సీ) చెక్ చేయకుండానే పనులకు పురమాయించడంతో కరెంట్ షాక్ తగిలి ప్రైవేట్ లేబర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

ఇటివల కురిసిన ఆకాల వర్షానికి మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో ఫీడర్ నుంచి సప్లయ్ నిలిచిపోవడంతో యుద్ద ప్రాతిపదికన కరెంట్ లైన్లకు మరమ్మత్తు కోసం కాంట్రాక్టర్ కు పని అప్పగించారు. అక్కడ పని చేసే సమయంలో స్థానికంగా లైన్ మెన్ , లైన్ ఇన్స్ పెక్టర్లు స్థానికంగా ఉండి పనులు సంబంధిత ఎఈ పర్యవేక్షణలో జరుగాలి. అయితే ఈ నెల 22న నర్సింగ్ పల్లి వద్ద ఫీడర్ సప్లయ్ పునరుద్దరణ కొరకు ప్రైవేట్ కాంట్రాక్టర్ పనిని పురమాయించిన విద్యుత్ శాఖాధికారులు స్థానికంగా ఉండకుండా ఎల్ సీ ఇచ్చాం, పని చేసుకోండని అక్కడి నుంచి వెళ్లిపోయారని కాంట్రాక్టర్ చెబుతున్నారు. కాంట్రాక్టర్ ఆదేశాలతో అక్కడ పని చేస్తున్న లేబర్ మూషిర్ అనే యువకుడు విద్యుత్ పోల్ పై ఎక్కడంతో కరెంట్ షాక్ కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఉన్నఫళంగా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఘటన స్థలాన్ని నిజామాబాద్ డిఈతో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. కాని విధ్యుత్ శాఖాధికారులు తాము ఎల్ సి ఇవ్వలేదని అది తీసుకోకుండానే కాంట్రాక్టర్ పనులు జరపించడంతో ప్రమాధం జరిగిందని చెబుతున్నారు. విధ్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు జరుగుతుండగా సంబంధిత శాఖలో ఓక్క ఉద్యోగి అక్కడ లేకపోవడం ఎమిటంటే అధికారుల వద్ధ సమాధానం లేదు.

- ఎల్ సీ తీసుకోకుండానే పని చేయడం వల్లే ప్రమాదం : నాగశర్వాని (మోపాల్ ఏఈ)
నర్సింగ్ పల్లి వద్ద ఫీడర్ లో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కాంట్రాక్టర్ కు పని అప్పగించాం. వారి పనులు చేసే సమయంలో ఎల్ సీ తీసుకోవాలి. కానీ ఎల్ సీ తీసుకోకుండానే పని చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఇందులో విద్యుత్ శాఖాధికారుల తప్పిదమేమి లేదు.

- విద్యుత్ శాఖ అధికారులు ఎల్ సీ ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాం : కాంట్రాక్టర్ మతిన్
నర్సింగ్ పల్లి ప్రాంతంలో కరెంట్ మరమ్మత్తుల విషయంలో అధికారులు ఎల్ సీ ఇచ్చిన తర్వాతనే పనులు చెపట్టాం. ఈ విషయం స్వయంగా లైన్ మెన్ తో పాటు ఇతర అధికారులు స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో అధికారుల సమక్షంలో లైన్ మెన్ ఇచ్చిన వాంగ్మూలంను రికార్డు చేశారు. ఇప్పుడు అధికారులు మాటా మార్చారు. అధికారులు ఇప్పటి వరకు స్పంధించి చర్యలు తీసుకోక పోగ, బాధితుడికి న్యాయం చేయలేదు. ఈ విషయంలో విధ్యుత్ శాఖ సియండికి పిర్యాదు చేస్తాం.

