29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మీరు ఏ జాబితాలో ఉన్నారు..?

Must read

📰 Generate e-Paper Clip

. ఇందిరమ్మ దరఖాస్తులను మూడు కేటగిరిలు చేసిన ప్రభుత్వం

. ఎల్-1, ఎల్-2, ఎల్-3గా దరఖాస్తుల విభజన

హైదరాబాద్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాష్ర్ట  ప్రభుత్వం దరఖాస్తులను మూడు జాబితాలుగా విభజించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజించింది.

ఏ జాబితాలో ఎవరు..

సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారి పాటు సొంత స్థలంలో గుడిసె, రేకు షెడ్డు, మట్టి ఇల్లు నిర్మించుకున్న వారి నుంచి అందిన దరఖాస్తులను ఎల్-1లో చేర్చింది. అలాగే సొంత స్థలంతోపాటు ఇల్లు లేనివారిని ఎల్-2లో, సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3లో చేర్చారు.

దరఖాస్తులు ఎన్ని..

ఎల్-1లో 21.93 దరఖాస్తులు అందగా, ఎల్-2లో 19.96లక్షలు, ఎల్-3లో 33.87 లక్షల దరఖాస్తులు రాష్ర్ట వ్యాప్తంగా అందాయి. ముందుగా ఎల్-1, ఎల్-2 దరఖాస్తు దారులకు ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్-3లోని మెజార్టీ దరఖాస్తుదారులు ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులు కానున్నారు.

More articles

Latest article