బతుకమ్మ,మోర్తాడ్: మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు. స్రీ నిధి రుణాలు తీసుకొని చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా మహిళలు ఎదుగుతున్నారని తెలుపడం లో సందేహం లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి స్వయం సహాయక సంఘాల సభ్యులకు మహిళా శక్తి మీ సేవ కేంద్రాల ద్వారా తోడ్పాటును అందిస్తుంది.
జిల్లా లో నూతనంగా 37 కేంద్రాలు ఏర్పాటు..
నిజామాబాద్ జిల్లాలో మొత్తం నూతనంగా 37 మీ సేవ కేంద్రాలు ఏర్పాటు కాన్నునాయి. ఇందులో భాగంగా కేంద్ర నిర్వహణ బాధ్యతను గ్రామ సమైక్య సంఘాలకు అప్పగించారు. వారు కంప్యూటర్ ఆపరేటర్లను ఎంపిక చేస్తూ తీర్మానం పంపించాలి. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి స్రీ నిధి ద్వారా రుణం మంజూరైతే కేంద్రాలు ప్రారంభమవుతాయి.
ఇవన్నీ గ్రామపంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, రైతు వేదికల తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నరు కేంద్రం నిర్వహణ బాధ్యత గ్రామ సమైక్య సంఘాల (వీవో)కు అప్పగించింది.
స్రీ నిధి ద్వారా రుణం..
ఈ సేవ కేంద్రాల ఏర్పాటు అవసరమైన రూ.2 లక్షల స్రీ నిధి ద్వారా అందజేస్తారు. అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, జిపిఎస్, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ తదితర కొనుగోలు చేయవలసి ఉంటుంది. రుణం తీసుకొని మీ సేవ కేంద్రం ప్రారంభమైన తర్వాత నెల నెల చెల్లించాలి. గ్రామ సమైక్య సంఘాల వద్ద డబ్బులు ఉంటే ఆయా పరికరాలు కొనుగోలు చేసుకోవచ్చు లేని వారు మాత్రం రుణం పొందవచ్చు.
రెండు నెలలు అవుతుంది..
మీ సేవ కేంద్రాలు నిర్వహణకు అభ్యర్థులను ఎంపిక చేయడం భవనాలను ఎంపిక చేయడం అన్ని విధివిధానాలను సిద్ధం చేసి రెండు నెలలు గడుస్తుంది. ఇప్పటివరకు ఉన్నతాధికారి నుంచి ఆ దేశంలో రాకపోవడంతో అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మీసేవ కేంద్రాలు ఏర్పాటు కానున్న గ్రామాలు..
ఆర్మూర్ : అంకాపూర్, గోవింద్ పెట్, ఇస్సాపల్లి. సుర్బీర్యల్ *బాల్కొండ* చిట్టాపూర్ భీంగల్ : బెజ్జోరా, జాగిర్యాల్ ,పురానిపేట్. మెండోరా, గోనుగోప్పుల, బోధన్ : ఊట్ పల్లీ, అందాపూర్, ఎరజ్ పల్లీ డిచ్ పల్లి: మెంట్రాజ్ పల్లీ , సుద్దపల్లి ధర్మారం (బి).డొంకేశ్వర్ : డొంకేశ్వర్ మారంపల్లి. ఇందల్ వాయి : ఎల్లారెడ్డి పల్లె కమ్మర్ పల్లీ : కోన సమున్ దర్, మక్లూర్అమ్రద్, మెండోరా : సావేల్ పోచంపాడ్ మోర్తాడ్ : తిమ్మాపూర్, సుంకేట్, శేట్ పల్లీ, మోస్రా : గోవూరు, మోపాల్ : కంజర, సిర్పూర్, బాడ్సి నందిపేట్ : హెచ్ కొండూరు నవీపేట్ : మోకాన్ పల్లీ రెంజల్ : కందకుర్తి, దూపల్లి, తాడ్ బిలోలి సాలూరహుస్నా నిజామాబాద్ రూరల్ కొండూర్.
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే..
సాయ గౌడ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (నిజామాబాద్)
మీసేవ కేంద్రాల నిర్వహణ మొత్తం మహిళా సంఘాలు చూసుకోవాల్సి ఉంటుంది. సభ్యుల ఎంపిక పూర్తయింది. కేంద్రాల ఏర్పాటుకు భవనాలు సైతం ఎంపిక చేయడం పూర్తయింది. అన్ని విషయాలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి మీసేవ కేంద్రాలు ప్రారంభిస్తాం.
మీ సేవ ఆదేశాలు వచ్చేది ఎప్పుడో…?
