28.8 C
Hyderabad
Monday, August 3, 2026

సిద్దుల గుట్ట సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమైనాయి రేవంత్..?

Must read

📰 Generate e-Paper Clip

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ బతుకమ్మ : అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ దేవుళ్లపై  ప్రమాణాలు చేసి ఇచ్చిన హామీలను ఏ గంగలో కలిపారని సీఎం రేవంత్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రశ్నించారు. సిద్దుల గుట్ట మీద ఒట్టు పెట్టి ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ మొఖం పెట్టుకొని నిజామాబాద్ కు ఓటు అడగటానికి వచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నగరంలో చంద్రశేఖర్ కాలనీలో రీజినల్ లైబ్రరీలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలలో  నిజామాబాదు యువతకు ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. రూ.4వేల భృతి ఎంత మంది నిరుద్యోగులకు ఇచ్చారని, రూ.2500 ఎంత మంది ఆడపచులకు ఇచ్చారని ప్రశ్నించారు. రూ. 6 వేల కోట్ల  ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలతో ఎస్సీ, ఎస్టీ,బీసీ ల విద్యార్థులు చదువులకు దూరం అయ్యే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించించదని మండిపడ్డారు. జిల్లా జర్నలిస్ట్ లకు ఇందిరమ్మ ఇండ్లు, వారి సంక్షేమనికి ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల తరుపున మండలిలో ప్రశ్నించే గొంతు వినపడాలంటే బీజేపీ బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, బీజేపీ నాయకులు వినోద్,మాస్టర్ శంకర్,గంగాధర్, మఠం పవన్, ఆనంద్,సాయి ప్రవీణ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article