సిద్దుల గుట్ట సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమైనాయి రేవంత్..?
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ బతుకమ్మ : అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ దేవుళ్లపై ప్రమాణాలు చేసి ఇచ్చిన హామీలను ఏ గంగలో కలిపారని సీఎం రేవంత్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రశ్నించారు. సిద్దుల గుట్ట మీద ఒట్టు పెట్టి ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ మొఖం పెట్టుకొని నిజామాబాద్ కు ఓటు అడగటానికి వచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నగరంలో చంద్రశేఖర్ కాలనీలో రీజినల్ లైబ్రరీలో...