. . .దమ్ముంటే ప్రశాంత్ రెడ్డి చర్చ కు రావాలని సవాల్
. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పైర్
నిజామాబాద్, బతుకమ్మ
కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. భీంగల్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో విద్యుత్ చార్జీలు పెంచి గృహ వినియోగదారుల, వ్యాపార వినియోగదారుల నడ్డి విరిచిన టిఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు పెంచిన విద్యుత్ చార్జీలు చాలా ఉన్నాయని,అందులో భాగంగా గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని విధ్వంసం చేయటంతో పాటు అడ్డగోలు విద్యుత్తు ఛార్జీలను పెంచి వినియోగదారులకు వాతలు పెట్టిందన్నారు. ఛార్జీల పెంపుతో తెలంగాణలోని అన్ని వర్గాలపై మోయలేనంత భారం మోపిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో విద్యుత్తు ఛార్జీలు పెంచనే లేదని ఆ పార్టీ నేతలు అబద్దాలు వల్లిస్తున్నారన్నారు. గతంలో తాము చేసిన పాపాలను కొత్త ప్రభుత్వానికి అంటగట్టేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు.2022-23లో భారీ మొత్తంలో ఒకేసారి 16 శాతం ఛార్జీల పెంచిందని, వినియోగదారులపై ఒకేసారి రూ.6 వేల కోట్లకుపైగా భారం మోపిందన్నారు. 2020కి ముందు ఫిక్స్డ్ ఛార్జీల ప్రస్తావన లేదని, గృహ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ ఛార్జీలను వసూలు చేయటం మొదలు పెట్టింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. పేదలను, మధ్య తరగతి ప్రజలను ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలి పెట్టకుండా గత ప్రభుత్వం ఒక్కో యూనిట్ పై 50 పైసల నుంచి ఒక రూపాయి చొప్పున వడ్డించింది. వీటితో పాటు ఫిక్స్డ్ కస్టమర్ ఛార్జీలను కూడా పెంచింది. అప్పుడు వినియోగదారుల నుంచి అన్ని చోట్ల ఆందోళనలు చేసినా బీఆర్ఎస్ పెడచెవిన పెట్టిందన్నారు. మరోవైపు విద్యుత్తు సంస్థల లాభనష్టాలను వెల్లడించకుండా గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని సర్వనాశనం చేసింది. అందుకే తెలంగాణలోని డిస్కంలు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయన్నారు. తాను చెప్పిన వాటిలో అబద్ధాలు వున్న ప్రశాంత్ రెడ్డి కి పేద ప్రజలపై మక్కువ ఉంటే ప్రశాంత్ రెడ్డి చర్చకు రావాలని సమయం స్థలం మీరే నిర్ణయించి తెలిపితే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగ చర్చకు ప్రశాంత్ రెడ్డి సిద్ధం కావాలని మానాల మోహన్ రెడ్డి సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోదిరే స్వామి, టౌన్ అధ్యక్షులు నర్సయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్,బీసీ సెల్ మండల అధ్యక్షులు కోరాడి రాజు, బాల్కొండ నియోజకవర్గం యువజన అధ్యక్షులు నాగేంద్రబాబు,మండల యువజన అధ్యక్షులు బద్దం అవినాష్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,చంద్రు నాయక్, సురేష్,బొర్రన్న, తదితరులు పాల్గొన్నారు.
