- ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలలో భాగంగా ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడారు. లబ్దిదారులకు 300 ఇళ్లను పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు చివరి దశలో ఉన్నాయని, వాటిని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

డబుల్ బెడ్ రూములు అందని వారు ఎటువంటి అదైర్యానికి లోను కావొద్దని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అవకాశం కల్పించి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి పేద ప్రజల సంక్షేమమే కోరుకుంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అమలాయ్యేలా కార్యచారణ రూపొందించామన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గాని, అనుమానాలకు గాని గురికావద్దని తెలిపారు. ప్రతి ఒక్కరికి పథకాలు గడప గడపకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. మరికొన్ని రోజుల్లో మిగతా పథకాలు కూడా ప్రారంభించి దేశంలోనే నెంబర్ వన్ ప్రభుత్వంగా తీర్చి దిద్దబోతున్నామన్నారు. ఎల్లారెడ్డిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్ఢీఓ మన్నే ప్రభాకర్, మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కౌన్సిలర్లు, ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు కుర్మ సాయి బాబా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
