నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా రైల్వే కోర్టు ఆవరణలో వేడులకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ అంబెమ్ బాలరాజు కు రైల్వే పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మెజిస్ట్రేట్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోర్టు సిబ్బంది, మల్లేశ్వరి, రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ రెడ్డి, ఆర్.పి. ఎఫ్ సిబ్బంది న్యాయవాదులు వెంకటేష్,దేవదాసు,బాలరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
