29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ  : మాణిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలతో పాటు అన్ని వసతుల ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి పేరాల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ  భావి తరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  ఆడబిడ్డ పుట్టిననాటి నుంచి విద్య, వైద్యం, పెళ్లి చేసుకునేవరకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.అందులో భాగంగా బేటీ బచావో బేటీ పడవో, సుకన్య సమృద్ధి యోజన, పోషణ మహా వంటి పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్ 10% తీసుకొచ్చి విద్య, ఉపాధిలో అవకాశాలు కల్పించడం చరిత్రత్మక నిర్ణయం అన్నారు.  అనంతరం 800 నోట్ పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ , మాణిక్ భవన్ పాఠశాల అధ్యక్షులు ఇంగు శివ ప్రసాద్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి ఇల్లందుల ప్రభాకర్, క్యాషియర్ గాలి నాగరాజు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు మాణిక్ భవన్ పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.

We will work for the development of Manik Bhavan School

More articles

Latest article