మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా
నిజామాబాద్, బతుకమ్మ : మాణిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలతో పాటు అన్ని వసతుల ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి పేరాల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ భావి తరాలు ఆదర్శంగా...