. . . డీఈ కృష్ణమూర్తి
ఆలూర్, బతుకమ్మ :
రైతులకు సాగునీరు సకాలంలో అందించేందుకు శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆలూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో రైతు వారం కార్యక్రమాన్ని డీఈ కృష్ణమూర్తి, సర్పంచ్ ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల సంరక్షణలో రైతులు సహకరించాలని, నీటి వృథాను తగ్గించి అవసరానికి అనుగుణంగా వినియోగిస్తే పంటలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి అభివృద్ధి పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ విజయ్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రైతులకు సాగునీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న రైతులు కెనాల్‌పై రెండు కల్వర్టులు నిర్మించాలని, అలాగే ఆలూర్ బైపాస్ రోడ్డులో కాలువ అస్తవ్యస్తంగా ఉండటంతో రైతులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

దానిని వెంటనే మరమ్మతులు చేసి సరిచేయాలని అధికారులను కోరారు. దీనిపై స్పందించిన డీఈ కృష్ణమూర్తి రైతులు తెలిపిన సమస్యలను పరిశీలించి, త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైస్ మల్లారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ములకిడి శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్, వార్డ్ మెంబెర్స్ సంజీవ్, మల్లేష్, సాయిలు, శాఖ అధికారులు రాజు, శేఖర్, సాయన్న, గంగాధర్, సిబ్బంది, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
