. . . రూ.10,40,000 జరిమానా, 11 మందికి జైలు శిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 151 మందిని పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 151 మందిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టులలో హాజరు పరచగా 11 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించారని, మిగిలిన వారికి రూ.10,40,000 జరిమానా విధించారని ఆయనన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరని అన్నారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడుతుందని, మద్యం త్రాగి వాహనం నడిపి అనుకోని రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదని తెలిపారు. మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్, వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడునని, అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కలదని హెచ్చరించారు.
