ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తాం

0 1,590

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, బతుకమ్మ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి రికగ్నేషన్, ఆన్ డ్యూటీ సౌకర్యం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కల్పిస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహా సభలను ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు.

We will provide on-duty facility to SC and ST teachers

ఈ సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని అన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల లో చదివే 90%  విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ లే కాబట్టి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.  ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పనిచేస్తూ, సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలన్నారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చవాన్ శుభాన్ సింగ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, జనరల్ సెక్రటరీ సంగయ్య, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దుర్గన్న, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కూర పోచన్న, నిర్మల్ జిల్లా అధ్యక్షులు భీమన్న, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంధం విజయలక్ష్మి, ఎస్.యాదయ్య, చంద్రశేఖర్, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

We will provide on-duty facility to SC and ST teachers

Leave A Reply

Your email address will not be published.