29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కానిస్టేబుళ్ల రెండు దశాబ్దాల కలయిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు చెందిన 2004-2-05 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుళ్లు రెండు దశాబ్ధల ప్రయాణం వేళ ఓకే వేదికపై కలిసి సంబరాలు చేసుకున్నారు. తమ తోటి కానిస్టేబుళ్లతో ఆదివారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోని డిఆర్ఆర్ ఫంక్షన్ హల్ లో కలిసి ఆడిపాడారు. తమ 20 ఏళ్ల ఉద్యోగ విధి నిర్వహణలో కష్ట సుఖాలను కలిసి పంచుకున్నారు. తమతో పాటు కానిస్టేబుళ్లుగా ఎంపికై తరువాత కాలంలో ఎస్ఐలుగా పదోన్నతులతో సిఐలుగా ఉన్నవారితో ఎంజాయ్ చేశారు. తమ బ్యాచ్ కు చెందిన 53 మంది కానిస్టేబుళ్లు ఓకే వేదికపై సంబురం చేసుకొని భవిష్యత్తులో అందరు కలిసి మెలిసి కష్ట సుఖాలలో తోడుగా నిలువాలని నిర్ణయించారు.

More articles

Latest article