ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తాం

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, బతుకమ్మ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి రికగ్నేషన్, ఆన్ డ్యూటీ సౌకర్యం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కల్పిస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహా సభలను ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని అన్నారు....