- ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
- బోనస్ ఇవ్వకుండా కొనుగోలు కేంద్రాలు ఆలస్యం
- రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి: కెసిఆర్ అంటే అభిమానం ఉన్న రుణ మాఫీ కోసం కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించారని మాజీ మంత్రి, బాల్కొడ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో పచ్చి అబద్ధాలు, నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయన ప్రస్టేషన్ లో గ్రాఫ్ దిగిపోతున్న సందర్భంగా, అత్యంత వేగంగా దిగిపోతున్న గ్రాఫ్ ఉన్న ముఖ్యమంత్రి అని ఆయన వద్దకు చేరిందని అన్నారు. ఆడలేక మద్దెల మీద ఏడ్చినట్లు ఉందన్నారు. 6 గ్యారంటీ, 630 ఎన్నికల సమయంలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి. ఇప్పుడు ఒక్క హామీ కూడా పూర్తి కావటం లేదన్నారు. బుడబుక్కలోడు, బుద్దర్ ఖాన్ పాలన, బుల్డోజర్ పాలన అయ్యిందని విమర్శించారు. మహబూబ్ నగర లో నిండా ముంచి రుణ మాఫీ చేశామని మాట్లాడుతున్నారని తెలిపారు. చెప్పిన అబద్ధాలు 100 సార్లు చెబితే నిజం అవుతదనుకుంటే అది సరికాదు అని అన్నారు. రుణ మాఫీ విషయంలో 60 లక్షల మంది అంచనా ఉంటే 40 వేల కోట్లు రుణాలు తీస్కున్నారని తెలిపారు. 39 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 3 లక్షల మందికి రూ. 2700 కోట్లు చేసి మొత్తం రుణ మాఫీ చేశామని రైతు పండగ చేసారని ఎద్దేవా చేశారు. 36 లక్షల మందికి, రూ.20 వేల కోట్లు చేయాలి అని డిమాండ్ చేశారు. ఇంకా 50 శాతం చేయాల్సి ఉందని అన్నారు. జిల్లా లో 379521రైతులు ఉంటే 201967 మందికి రుణ మాఫీ అయిందని, ఉమ్మడి జిల్లాలో ఇంకా 179000 మందికి రుణ మాఫీ కావాలని తెలిపారు. 100 శాతం అయింది అని అనటం సరికాదన్నారు. నిజామాబాద్ రుణ మాఫీ 51 శాతం మందికి ఇంకా కాలేదని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ రుణమాఫీ రూ.2511కోట్లు చేస్తే రూ.1518 కోట్లు కాంగ్రెస్ చేసిందని తెలిపారు. కల్లబొల్లి మాటలు ఆపి అందరికీ రెండు లక్షల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా 179000 రైతులకు రుణ మాఫీ చేయాలని తెలిపారు. అందరికీ రుణమాఫీ అయ్యేవరకు వెంటాడుతామని హెచ్చరించారు. వరి 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని, బోనస్ 12 లక్షలకు ఇవ్వాల్సింది 3 లక్షలకు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. బోనస్ రూ.99 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 5 లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. తాము 8, 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని అన్నారు. 434000 ఎకరాల్లో వరి పడిందని, ఎకరానికి రూ.12500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బయట అమ్ముకున్న వారికి కూడా బోనస్ ఇవ్వాలని అన్నారు. కెసిఆర్ 11 పంటలకు రైతు బంధు వేశారని, రేవంత్ రెడ్డి 15000 వేస్తామని చెప్పి ఓట్లు దండుకుని రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.