26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ ఉద్యోగుల హక్కుల సాధన కోసం  ఉద్యమిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ఉద్యోగ జేఎసీ చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 17 నెలలుగా ఎదురుచూస్తూ అనేక పర్యాయాలు రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ,సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మంత్రివర్గ ఉప సంఘంతో అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ ,స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండడం శోచనీయమని నిజామాబాద్ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. శుక్రవారం టీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన  విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు..ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లులు నెలకు 700 కోట్లు ఉద్యోగ లోకానికి చెల్లిస్తామని చెప్పినప్పటికీ నేటికి కార్యరూపం దాల్చకపోవడంఅలాగే ఎంప్లాయిస్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పి నేటికీ చేయకపోవడం ఉద్యోగ లోకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా భావిస్తున్నామన్నారు అలాగే1 జూలై 2023నుండి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ మాట ఎత్తకపోవడం అధికారుల కమిటీ , జేఎసీఇచ్చిన 57 డిమాండ్లకు సంబంధించిన నివేదికను ఇంతకాలం బయట పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అని… ప్రశ్నించారు కొన్ని శాఖల్లో ఉద్యోగుల ఖాళీలను తగ్గిస్తూ డౌన్ సైజు చేయాలని చూడటం దుర్మార్గం అని పేర్కోన్నారు. కొత్త పోస్టులను సృష్టించే క్రమంలో ఖాళీలను కొత్త పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తే సరిపోతుంది కనుక ముఖ్యమంత్రి యావత్ మంత్రిమండలి సభ్యుల ఆదేశాలను గౌరవించాల్సిన అధికారులందరూ ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అనే అనుమానం కలగకుండా ఉండాలంటే సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. అందుకే ఉద్యోగుల జేఏసీ నిజాంబాద్ జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్న ఈ క్రింది ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నామని లేకపోతే ఉద్యోగ జేఎసీ పిలుపు మేరకు ఉద్యోగుల హక్కుల సాధనకు ఉధ్యమిస్తామని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా కో చైర్మన్లు రమేష్ ,ధర్మేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సురేష్, రవీందర్, వైస్ చైర్మన్ లురామ్మోహన్ రావు, నేతికుంట శేఖర్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, ఎంప్లాయిస్ సెక్రటరీలు జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article