30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూర్, బతుకమ్మ : రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా తామంతా ముందుకు సాగుతున్నామని  పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి ఉమ్మడి జిల్లాకు వచ్చిన మహేశ్ కుమార్ గౌడ్ కు భిక్కనూరు   టోల్ ప్లాజా దగ్గర జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. మహేశ్ తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపుతుందని, కనీసం 90 శాతం సర్పంచ్, ఎంపీటీసీ జడ్పీటీసీ, విండో చైర్మన్ స్థానాలను  కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా తామంతా కృషి చేయడం జరుగుతుందన్నారు.  కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, జిల్లా సీనియర్ నాయకులు ఎడ్ల రాజారెడ్డి, ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి,  టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.  

More articles

Latest article