27.2 C
Hyderabad

బీసీ రిజర్వేషన్ అడ్డుకునే వారిని తరిమికొడతాం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  బీసీ రిజర్వేషన్ అడ్డుకునే వారిని తరిమికొడతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరుణంలో కొందరు కోర్టుల్లో కేసులు వేయడాన్ని నిరసిస్తూ  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  పిలుపుమేరకు
మంగళవారం ఫులాంగ్ చౌరస్తాలో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద బీసీ కుల సంఘ నాయకులు, సభ్యులు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడారు. బీసీలకు ద్రోహం చేసే వారిని వదిలే ప్రసక్తి లేదని,  బీసీల హక్కులను కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో  దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్ బగ్గలి అజయ్, బసవ సాయి, శ్రీలత, ఆర్టీసీ శ్రీనివాస్, వాసం జయ, రుక్మిణి, సదానంద్, బాలన్న, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article