అజారుద్దీన్ ను కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటాం

0 16,547
  • నా దృష్టిలో పిసిసి పదవి ఎంతో గొప్పది
  • నేను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేను
  • టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్, బతుకమ్మ : మేటి క్రీడాకారుడు అజారుద్దీన్ కేబినేట్ లోకి తీసుకోవాల‌ని భావిస్తే బీజేపీ, బిఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడారు. కెప్టెన్ గా అజారుద్దీన్  దేశానికి సుదీర్థ కాలం  సేవ‌లు అందించారన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ చీక‌టి ఒప్పందాన్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలని సూచించారు. అజారుద్దీన్ కేబినేట్ లోకి తీసుకోవాల‌ని సీఎం భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుటీల ప్ర‌య‌త్నం చేస్తోందన్నారు. అజారుద్దీన్ గురించి దేశ, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియంది కాదని తెలిపారు. క్రీడా ప్ర‌పంచానికే కాదు ఎంపీగా అజారుద్దీన్  ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించారన్నారు. అజారుద్దీన్ ను మంత్రి కాకుండా ఎలక్ష‌న్ క‌మిష‌న్ కు బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేయ‌డం విచార‌క‌రమని అన్నారు. అనైతికంగా అజారుద్దీన్ మంత్రి కాకుండా బీజేపీ,బీఆర్ఎస్‌ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయని తెలిపారు.  బీజేపీ ద్వంద్వ వైఖ‌రి ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన  అవ‌స‌ర‌ముందన్నారు. గతంలో బీజేపీ రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని మంత్రిని చేశారని పేర్కొన్నారు. శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ  అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ ఉపఎన్నిక కు 20 రోజుల ముందు సురేంద్ర పాల్ సింగ్ ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారని గుర్తుచేశారు. ఉప ఎన్నిక‌ అభ్య‌ర్థిని మంత్రిగా చేస్తే త‌ప్పులేనిది? అజారుద్దీన్ మంత్రి చేస్తే త‌ప్పేంటి అని బీజేపీ నేత‌ల‌ను ప్రశ్నించారు. అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్ర గవర్నర్ పైన  బీజేపీ ఒత్తిడి తీసుకువ‌స్తోందన్నారు. బీజేపీ తో బిఆర్ ఎస్ కుమ్మ‌క్కై ఉంద‌ని కేసీఆర్ కూతురు క‌విత స్వ‌యంగా చెప్పారని అన్నారు. మైనార్టీల‌కు ల‌బ్ది చేకూరుతుంద‌నే ఉద్దేశ్యంతోనే అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని బీజేపీ అడ్డుకుంటోందని తెలిపారు. గ‌వ‌ర్నర్ పై కేంద్రంలోని బీజేపీ ఒత్తిడి తెస్తుంద‌న్న స‌మాచారం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయం అని తెలిపారు.  అజారుద్దీన్ , కోదండ‌రాంను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి కేబినేట్ గ‌వ‌ర్న‌ర్ కి పంపిందని, అది అక్క‌డ పెండింగ్ ఉందని తెలిపారు. కోర్టులో గెలిచితీరుతామ‌న్న న‌మ్మ‌కముందని తెలిపారు. అజారుద్దీన్ కేబినేట్ లోకి రావ‌డం ఖాయం.. మంత్రిగా అజారుద్దీన్ మైనార్టీల శ్రేయ‌స్సుకోసం కృషి చేస్తార‌న్న న‌మ్మ‌క‌ముందని అన్నారు. నా దృష్టిలో పిసిసి పదవి ఎంతో గొప్పదని, టీపీసీసీ అధ్యక్ష పదవితో సంతృప్తిగా ఉన్నానని, నేను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేనని అన్నారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరెకెల నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు.

We will definitely induct Azharuddin into the cabinet.

Leave A Reply

Your email address will not be published.