25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అధిష్ఠానం నిర్ణయం మేరకు కమిటీలను ప్రకటిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్

 

. . . గుమ్మిర్యాల్, నాగేంద్రనగర్ గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

గ్రామ కాంగ్రెస్ కమిటీలు, మండల కాంగ్రెస్ కమిటీలు, యూత్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుపై స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి పార్టీ అధిష్ఠానానికి పంపిస్తామని, వారి నిర్ణయం మేరకు కమిటీలను ప్రకటిస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ తెలిపారు. ఆయన అధ్యక్షతన మండలంలోని గుమ్మిర్యాల్, నాగేంద్రనగర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం ఎరువుల కొరత లేదని, రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందస్తుగా ఎరువుల కేటాయింపులు చేసిందని వివరించారు. గ్రామాల వారీగా రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని, సొసైటీలలో చెల్లింపులు పూర్తి చేసిన వెంటనే యూరియా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొన్ని సొసైటీలు గతంలో అప్పులు చేసి డిఫాల్ట్ అయిన నేపథ్యంలో రైతులు సమయానికి చెల్లింపులు చేయకపోయినా ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులను పంపిణీ చేస్తోందని, యాప్ విధానం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉందని పేర్కొన్నారు. ఎరువుల దళారీ వ్యవస్థను నిర్మూలించి ప్రతి రైతుకు సమానంగా ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టిస్తూ అయోమయానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎరువుల కోసం గంటల తరబడి, రోజుల తరబడి క్యూలలో నిలబడిన పరిస్థితులను గుర్తు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న యాప్ విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం దశలవారీగా సరిదిద్దుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి రైతుకు సులభంగా ఎరువులు అందేలా కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవసరమైన మేర ఎరువులు సరఫరా చేయకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. అలాగే ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడం వల్ల రైతులతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో డీజిల్, పెట్రోల్ ధరలను కూడా తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో గుమ్మిర్యాల్ సర్పంచ్ దేశబోయిన జమున సంజీవ్ యాదవ్, తోర్తి గ్రామ సర్పంచ్ కౌడ భూమేశ్వర్, నాగేంద్రనగర్ సర్పంచ్ సందే రంజిత్, ఉపసర్పంచ్‌లు కిషోర్, సుమన్ గౌడ్, షేక్ జాకీర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోర్తి గంగామోహన్, ఏనెండ్ల రాకేష్, కాటిపల్లి రఘుపతి, షెంసన్, ముక్కెర గజేందర్ యాదవ్, అనిల్ యాదవ్, కాటిపల్లి దేవన్న, పన్నాల నర్సారెడ్డి, కమ్మరి హరీష్, గంగ భూమన్న, ఇనర్ల శ్రీనివాస్, కమ్మరి ముత్తెన్న, సోమ రాకేష్, భార్గవ్, వకీల్, బోడరాజ్, రవి గౌడ్, మల్లేష్, బోడ గణేష్, కుశ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article