30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

 కులగణన పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేంద్రం ఓబీసీ కుటుంబాలను లెక్కించాలి

. . . తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టవచ్చని  సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పు కులగణన వ్యతిరేకులకు చెంపపెట్టు లాంటిదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నరాల సుధాకర్ విలేఖరులతో మాట్లాడుతూ….ఈరోజు సుప్రీంకోర్టు బీసీ కులం చేయాలని ఇచ్చిన తీర్పుకు ముఖ్య కారణం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పోరాట ఫలితమేనని అన్నారు.దేశవ్యాప్తంగా బీసీ జనాభా ను లెక్కించాలని, జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు దక్కాలని తాము దశబ్దాలుగా, చేసిన పోరాట ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని ఆయన తెలిపారు కులగనన చేస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూసిందని, సుప్రీంకోర్టు తీర్పుతో నైనా కేంద్ర ప్రభుత్వం తమ మనసు మార్చుకుని ప్రస్తుతం మొదటి దఫా జరుగుతున్న కుటుంబాల లెక్కింపులో బీసీ కుటుంబాల లెక్కింపు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు  బీసీ జనాభా లెక్కలను సుప్రీంకోర్టు  సమర్ధించినందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధన్యవాదాలు అని నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ అన్నారు.ఈ పత్రికా విలేకరుల సమావేశంలో కరిపె రవీందర్, మాడ వేడి వినోద్ కుమార్, కొయ్యాడ శంకర్, సాయి బసవ, కొట్టూరు చంద్రకాంత్, శ్రీలత, బగ్గలి అజయ్, సుర్నార్ విజయ్, చెరుకు లక్ష్మణ్ గౌడ్, సురేందర్, దేశాయి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article