29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. పెద్దన్న

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. పెద్దన్న అన్నారు. కళాశాలలో నిర్వహించిన “అన్నా – అక్కా మెంటార్‌షిప్” శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐ సాధనాలు, డిజిటల్ లెర్నింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శిక్షణ పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్, ఏఐ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సీసీఈ కమిషనర్ దేవసేన, జాయింట్ డైరెక్టర్ బాల భాస్కర్, రాష్ట్ర ఏఐ నోడల్ ఆఫీసర్ డా. సరిత మార్గదర్శకత్వంలో నిర్వహించబడుతోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ వినియోగంపై అవగాహన కల్పించి, భవిష్యత్ సవాళ్లకు వారిని సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. మర్రిపల్లి భూపతి, ఐక్యూఎసి కో ఆర్డినేటర్ డా.యు.దశరథ్, నోడల్ అధికారులు డా.పి.భ్యూలా, ఎన్. రాజయ్య, వి. శ్వేత, భీమ్‌గల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నోడల్ అధికారులు డా. బి. సుమలత, శంకర్, అధ్యాపకులు డా.టి.రవీందర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండాజీ సృతిన్ రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని ఏఐ సాధనాల వినియోగం, డిజిటల్ లెర్నింగ్ అవకాశాలపై విద్యార్థులకు శిక్షణ అందించారు.

More articles

Latest article