సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలి

0 9,154

నిజామాబాద్,  బతుకమ్మ : తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలని  పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికి విద్రోహ దినమే అని  పేర్కొన్నారు.   నగరంలో ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ” 1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం” సదస్సు ను  పీడీఎస్ యూ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడారు.  నాటి నిజాంనిరంకుశ పాలనకు కాశీంరజ్వీ ఆగడాలకు అకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకులు పోరాటం చేశారని గుర్తు చేశారు.  దొరలు, భూస్వాములు,పటేల్, పట్వారిలు ,జమీందారులు దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలకు భూములు దక్కాలని తెలంగాణ సాయిధ పోరాటం నిర్వహించి లక్షల ఎకరాలను కమ్యూనిస్టులు ప్రజలకు పంచారని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో  పీడీఎస్ యూ నగర నాయకులు నిఖిల్, సాయికిరణ్, వంశీ,ప్రసాద్ ,రాజు , విద్యార్థులు పాల్గొన్నారు.

We must fight education issues with the spirit of armed struggle.

Leave A Reply

Your email address will not be published.