సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలి
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికి విద్రోహ దినమే అని పేర్కొన్నారు. నగరంలో ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో " 1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం" సదస్సు ను పీడీఎస్ యూ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటి నిజాంనిరంకుశ పాలనకు కాశీంరజ్వీ ఆగడాలకు అకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకులు...