30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నూతన జాతీయ విద్యా విధానాని కి వ్యతిరేకంగా పోరాడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి భానోత్ రఘురాం నాయక్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశ యువత భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఆదర్శంగా తీసుకొని దేశ యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్దం కావాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి భానోత్ రఘురాం నాయక్ అన్నారు. అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల అధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 95 వ వర్ధింతిని సోమవారం ఘనంగా నిర్వహించారు.

 

We must fight against the new national education policy.

 

రైల్వే స్టేషన్ దగ్గర ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యాలయం దగ్గర నుండి భగత్ సింగ్ చౌరస్తా వరకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా కాగడాల ర్యాలీ నిర్వహించి అనంతరం భగత్ సింగ్ చౌరస్తా వద్దా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంరతం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యా కాషాయకరణ, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా విద్యారంగానికి బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 8.22% కేటాయించడం జరిగిందని, ఈ నిధుల ద్వారా విద్యారంగానికి పెద్దగా ఒరిగేది ఏమీ లేదని ప్రభుత్వ విద్యారంగాన్ని పెద్ద పీట వేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పక్కన పెట్టడం సిగ్గుచేటని ఆయనన్నారు. అదే విధంగా 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు ఉండటం వలన పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమైన అవకాశం ఉందని ఆయనన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని ఆయనన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యలు పెరిగిపోవడం వలన ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగులకు బిజేపీ కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో అన్నట్టు విధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుభోద్, జిల్లా ఉపాధ్యక్షుడు కుషాల్, నాయకులు కిషోర్, గణేష్, నిఖిల్, చిన్న క్రిష్ణ, గౌతమ్,సాయి,నితిష్ తదితరులు పాల్గొన్నారు.

 

We must fight against the new national education policy.

More articles

Latest article