. . . ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్
హైదరాబాద్, బతుకమ్మ :
ఎన్ఎస్ యుఐ నాయకులు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ అన్నారు. గాంధీభవన్ లో ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి స్వామి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్ఎస్ యుఐ కార్యకర్త రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అలాగే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రంలో రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అందుకోసం ఎన్ఎస్ యుఐ ని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతోమంది నాయకులు ఆర్థికంగా చితికిపోయి ఉన్నప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించారన్నారు. వారందరినీ పార్టీ పెద్దలు గుర్తించారని, తప్పకుండా వారందరికీ తగిన సమయంలో తగిన అర్హత తో కూడిన అవకాశం కల్పిస్తారని తెలిపారు. అలాగే ఈ నెల 19న రాష్ట్రానికి రానున్న జాతీయ ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు వినోద్ జాకర్ కి ఘన స్వాగతం పలికి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ.ఫాహీమ్, రాష్ట్ర ఎన్ఎస్ యుఐ లీగల్ సెల్ అక్బర్, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రితీష్ రావు, రాహుల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
