నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రైతులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఇన్ చార్జి ఎస్.జ్యోతి అన్నారు. బోర్గం పి తాడేం గ్రామంలో పీఏసీసీ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్ చార్జి ఎస్ జ్యోతి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యం రూ.2389 లకు, బి గ్రేడ్ కు రూ.2369 లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యంలో తేమశాతం, తాలూ, తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రెండు నుంచి ఐదు కిలోలు కట్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని అధికారులు మిల్లర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని వారన్నారు. గన్ని బ్యాగుల కొరతతో పాటు లారీలు ఆలస్యంగా రావడం వల్ల తీవ్రమవుతు ఎండలకు ధాన్యం వేటు తగ్గి రైతులు నష్టపోతారని అందుకు గాను అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ కంటాలైన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, కే సూర్య రెడ్డి, సర్పంచ్ కే జలంధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వేల్పూర్ భూమయ్య, ఏఈఓ రంజిత్, కార్పొరేట్ యాదాల నరేష్, చిట్టి సాయి రెడ్డి, కే రాజారెడ్డి, సొసైటీ కార్యదర్శి అశోక్ కుమార్, అంగలి సుజాత, తిరుపతి, పూజ తో పాటు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.