26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీఅర్ ఎస్ పాలనలో ఆర్థిక విద్వంసమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేశాం

Must read

📰 Generate e-Paper Clip

…కులం మతం పేరిట బీజేపి ఎన్నికల్లో పాలిటిక్స్ చేస్తుంది

 

……టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

కులం మతం పేరిట బీజేపి ఎన్నికల్లో పాలిటిక్స్ చేస్తుందని, శ్రీరాముడిని వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని,ఎన్నికలకు ఏ లెక్కన వాడుకుంటారు.. రాముడేమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా అని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా వ్యాఖ్యనించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలు రాగానే బీజేపి మతం పేరిట రాముడి పేరిట ఓట్లడుగుతూ లబ్ది పొందాలనుకోవడం శోచనీయమన్నారు.ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని విమర్శించారు.దేవుడి పేరిట కాకుండా 12 ఏండ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పి బీజేపి ఓట్లడగాలని సూచించారు.దేవుడి పేరిట ఓట్లడిగే వారికి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు నిజామాబాదు జిల్లాలో కాంగ్రెస్ సాదించిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, నిజామాబాదు కార్పోరేషన్ కూడా కాంగ్రెస్ దేనని అన్నారు.బీ ఆర్ ఎస్ పాలనలో ఆర్థిక విద్వంసమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేశామని, ప్రజలు కోరుకునే వారికే కాంగ్రెస్ బీ పాంలు ఇస్తామని స్పష్టం చేశారు.రాష్ట్రంలో సంక్షేమ పాలన ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ పది వేల కోట్లు కూడా పెట్టుబడులు తేలేదని, రేవంత్ సిఎం‌ అయ్యాక లక్షా 70 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని గుర్తు చేశారు. 5 లక్షల పై చిలుకు కోట్లు గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్నామ న్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎక్కడా ఇవ్వడం లేదని తెలంగాణ లో ఇస్తున్నామని, ఇల్లు లేని పేద వారుండవద్దని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. ఎన్నడూ లేనంత అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగినందున మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని, జిల్లాలో క్రీడాభివృద్ది కోసం కృషి జరుగుతుంద న్నారు. జిల్లాను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని,రాజీ లేకుండా నిజామాబాదు అభివృద్ధి కోసం పని చేస్తున్నాం‌మన్నారు.రాబొయే ఎన్నికలలో జనసేన వచ్చినా, కవిత పార్టీ వచ్చినా స్వాగతం చెబుతామని,ఎవరు వచ్చినా ప్రజల ఆదరణ పొందాలన్నారు. నిజామాబాద్ ను ఇందూరు గా మారుస్తానంటున్న అర్వింద్ ఏడేండ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఆపుతుంది బీజేపీనే అన్నారు. 42 శాతం రిజర్వేషన్ ‌ల అంశం తేలాకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతో సీఎం ఉన్నారున్నారు. 24 నెలల్లోనే 80 వేల ఉద్యోగాలిచ్చామని, మరో మూడేండ్లలో మరో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. బీఆర్ ఎస్ కథ ముగిసిందని, కవిత విమర్శలకు హరీష్ కేటీఆర్ ల వద్ద జవాబుందా అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నూడా చైర్మన్ కేశ వేణు తదితరులున్నారు.

More articles

Latest article