- కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసమూ లేదు
- మహాధర్నాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పై మాకు నమ్మకం ఉంది… కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసమూ లేదు.. అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు నిరససనగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్కు వద్ద మహాధర్నాకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘ఎస్సారెస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టింది. నెహ్రు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ కు ఎన్టీఆర్ మరమ్మత్తులు చేయించారు. కాంగ్రెస్ కట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టును కొట్టుకుపోతే కెసిఆర్ బాగు చేయించారు. కాంగ్రెస్ నిర్మించిన పులిచింతల గేట్లు కొట్టుకుపోయినయ్.. కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పలిగిపోయాయి. ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెడితే ప్రపంచం ముందు పరువు పోయేలా తనెల్ కూలిపోయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖం ని అద్దంలో చూసుకోవాలి. ఎస్ ఎల్ బి సి టనల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు..? కాంగ్రెస్ బిజెపి పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమైంది. కాలేశ్వరం లేకపోతే 35% తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మనమత్తులు చేపట్టాలి. తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పొలాలకు నీళ్లు ఇవ్వాలి. కాలేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే 99% పనులు పూర్తయ్యాయి. మిగతా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను. కాలేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. కాబట్టి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని బిజెపిని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికలు రాగానే కర్ణాటకలోని అపర భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేస్తున్నాను. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టిందే దాదాపు 80000 కోట్ల వ్యయంతో అందరూ లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగినట్లు..? బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. గోదావరి జలాలను పరిరక్షించుకోవడానికి తెలంగాణ జాగృతి నడుం బిగించింది’’ అని వ్యాఖ్యానించారు.

