నిజామాబాదు క్రైమ్, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి రెండు రోజుల జైలు శిక్ష విధించిందని ఒకటో టౌన్ ఎస్సై రఘుపతి తెలిపారు. నగరంలోని గాంధీ చౌక్ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేయుచుండగా అధికంగా మద్యం సేవించి ఓ వ్యక్తి పట్టుబడినట్లు పేర్కొన్నారు. బుధవారం అతడిని స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ఎదుట హాజరు పర్చగా ఆ వ్యక్తికి రెండు రోజలు జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా ఎస్సై హెచ్చరించారు.
