కమిషన్ పై మాకు నమ్మకం ఉంది

కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసమూ లేదు మహాధర్నాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పై మాకు నమ్మకం ఉంది... కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసమూ లేదు.. అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు నిరససనగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్కు వద్ద మహాధర్నాకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘ఎస్సారెస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి...