. . . తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ
హైదరాబాద్, బతుకమ్మ :
పదేళ్లలో గుజరాత్ కు ఎంత ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చాం. ఒక వేళ వివక్ష చూపి ఉంటే ఇప్పుడు ఇచ్చే నిధుల్లో సగం కుడా వచ్చేవి కావని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ అభివ్రద్దికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో రూ.9,377 కోట్లు విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్ లోని పీఎం మిత్ర పార్కును ప్రారంభించారు. జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి నాలుగు వరుసల రోడ్డు పనులకు, గెడెబెల్లూరు – మహబుబ్ నగర్ మద్య 165 కిలో మీటర్ల మేర హైవే పనులకు శంకు స్థాపన చేశారు. దండు మల్కాపూర్ లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్ ను జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తాను రాజకీయాలు మాట్లాడబోనని అంటున్నారని, తాను సైతం ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటం లేదని మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీని భారీగా పెంచామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలను జాగ్రత్తగా వినాలని కేవలం రోడ్ల నిర్మాణానికే రూ.2లక్షల కోట్లు కేటాయించాం. దీని వల్ల తెలంగాణకు ఎంతో లాభం చేకూరింది. ఉమ్మడి ఏపిలో రైల్వేకు కేవలం రూ.వెయ్యి కోట్లు ఇస్తే తెలంగాణకు రూ.5500 కోట్లు కేటాయించాం. రాష్ట్రానికి ఐదు వందే భారత్, ఆరు అమ్రత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఇచ్చాం. కాజీపేట జంక్షన్ కు రూ.వేల కోట్లతో అభివ్రద్ది చేస్తున్నామని గుర్తు చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్ ను తీర్చ దిద్దుతున్నామని ప్రధాని అన్నారు. రేవంత్… ఓ పని చేయ్.. నాతో కలిసి చూడు… నువ్వు వెళ్లాలని అనుకుంటున్న పొజిషన్ కు తీసుకెళ్తా అని ప్రధాని ఓపెన్ ఆఫర్ ఇస్తూ సెటైర్లు వేశారు.
