26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఉద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చాం

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తా లోని టీఎన్జీవో భవన్ లో నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు  ప్రభుత్వ సలహాదారు  మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో టీఎన్జీవో ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్టార్‌ విందులో  ఉద్యోగులతో పాల్గొనడం చాలా ఆనందంగా వుందన్నారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని

We came to power with the support of employees.

చెప్పారు.  రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షలు సుమన్, కార్యదర్శి నేతికుంట శేఖర్, ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, పెద్దొల్ల నాగరాజు, వివిధ యూనిట్ ల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, నుడా చైర్మన్ కేశవేణు, తదితరులు పాల్గొన్నారు.

We came to power with the support of employees.

More articles

Latest article