29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పల్లికొండ పాఠశాలకు డెస్క్ బెంచీలు వితరణ

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పల్లికొండ హైస్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష సెంటర్ కు అదే  పాఠశాలలో చదివిన 2004-05 పూర్వ విద్యార్థులు 10 డెస్క్ బెంచీలను వితరణ చేశారు గ్రామంలో నూతనంగా పదో తరగతి పరీక్ష సెంటర్ ను ఏర్పాటు చేయగా అదే గ్రామానికి చెందిన 2004 -05 పూర్వ విద్యార్థులు గల్ఫ్ దేశంలో ఉంటారు. వారికి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దొనకంటి రాజేష్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి మీ వంతుగా సహాయం చేయాలని కోరగా వెంటనే గల్ఫ్ లో ఉన్న పూర్వ విద్యార్థులు స్పందించి ఏడుగురు కలిసి 10 డిస్క్ బెంచీలు వితరణ చేశారు.దొనకంటి రాజేష్ సమాచారం మేరకు పాఠశాలకు ఇలాంటి సహాయం చేయడంతో గ్రామస్తులు వారిని అభినందించారు.పాఠశాలకు డెస్క్ బెంచీలు వితరణ చేసిన పూర్వ విద్యార్థుల్లో చిలువేరి. శ్రీకాంత్, గంగం కిషన్, వోడ్యాల బాలకిషన్, గంధం. కిషన్, పెద్దోళ్ల వినోద్,దామా ఉషాన్న మంతెన దిలీప్ కుమార్ లు  ఉన్నారు.

More articles

Latest article