27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రుణపడి ఉంటాం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కళాకారుల గురించి మాట్లాడిన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లకు రుణపడి ఉంటామని నిరుద్యోగ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి కర్క రమేష్, కోశాధికారి గణేష్ లు అన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ఆంజనేయులు స్టూడియోలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలో కళాకారుల గురించి గళమెత్తడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళకారుల పాత్ర ఎనలేనిదని, కళాకారులు లేని తెలంగాణ ఉద్యమం ఊహించలేమని అన్నారు. కళాకారుల ద్వారానే తెలంగాణ వచ్చిందని వారికి కళాశాధితులు ఉద్యోగాలు కల్పించాలని మాట్లాడడం గొప్ప విషయం అన్నారు. అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని మాట్లాడటం పట్ల నిజామాబాద్ జిల్లా నిరుద్యోగ కళాకారుల తరుపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడి12 ఏండ్లు గడిచిన గత ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులను మభ్యపెడుతూ ఏండ్లు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగుల పట్ల ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులపై దయ చూపాలని కోరారు. తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాడబోయి ఆంజనేయులు, సంజీవ్, మహేందర్, గోపాల్, శ్రీధర్, సద్గురు, స్రవంతి, అహ్మద్, అశోక్, రవి, సంతోష్ పాల్గొన్నారు.

More articles

Latest article