28.8 C
Hyderabad
Monday, August 3, 2026

నేడు ఉగాది… విశ్వావసు సంవత్సరాది

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ:  ఉగాది…..తెలుగు సంవత్సరాలలో ‘విభవ’తో మొదలై ‘అక్షయ’తో ముగుస్తుంది. ఇది 60 ఏళ్లకు కాల పరిమాణంగా ఉండగా, నేడు (ఉగాది) విశ్వావసు 39వ సంవత్సరంలో అడుగిడబోతున్నాం. అంగ్ల కాలమాన ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలుగా కాల చక్రం ఉంటుంది.   తెలుగు  చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు.  కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం.  వసంత రుతువు సైతం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.

శాలివాహనుడు పట్టాభిషక్తుడైన రోజున ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమని అర్థం. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి అది యుగాదిగా మారగా, రానురాను వాడుకలో ఉగాదిగా రూపొందింది.

  • ఉగాది పచ్చడి…

ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే   ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.

బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక,.. ఉప్పు- జీవితంలో ఉత్సాహం,.. రుచికి సంకేతం,.. వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు,… చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు,… పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు,.. కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు…

  • బతుకమ్మ పాఠకుల కోసం …
  • తెలుగు సంవత్సరాల పేర్లు… వాటి అర్థాలు
  1. ప్రభవ అంటే… ప్రభవించునది… అంటే… పుట్టుక. 2. విభవ – వైభవంగా ఉండేది. 3. శుక్ల… అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
  2. ప్రమోదూత…. ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
  3. ప్రజోత్పత్తి… ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
  4. అంగీరస… అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం. 7. శ్రీముఖ… శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం, అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
  5. భావ…. భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. 9. యువ…. యువ అనేది బలానికి ప్రతీక. 10. ధాత… అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.11. ఈశ్వర… పరమేశ్వరుడు. 12. బహుధాన్య… సుభిక్షంగా ఉండటం. 13. ప్రమాది… ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. 14. విక్రమ… విక్రమం కలిగిన వాడు. 15. వృష … చర్మం. 16. చిత్రభాను… భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. 17. స్వభాను… స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం. 18. తారణ… తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం. 19. పార్థివ… పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
  6. వ్యయ… ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం. 21. సర్వజిత్తు…. సర్వాన్ని జయించినది. 22. సర్వధారి -…సర్వాన్ని ధరించేది. 23.విరోధి…. విరోధం కలిగినట్టువంటిది.
  7. వికృతి… వికృతమైనటువంటిది. 25. ఖర…. గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి. 26. నందన … కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది. 27. విజయ… విశేషమైన జయం కలిగినది. 28. జయ…. జయాన్ని కలిగించేది. 29. మన్మథ… మనస్సును మధించేది. 30. దుర్ముఖి… చెడ్డ ముఖం కలది. 31. హేవిలంబి… సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం. 32. విలంబి… సాగదీయడం.
  8. వికారి…. వికారం కలిగినది.34. శార్వరి… రాత్రి. 35. ప్లవ… తెప్ప. కప్ప, జువ్వి… దాటించునది అని అర్థం. 36. శుభకృత్… శుభాన్ని చేసి పెట్టేది.
  9. శోభకృత్… శోభను కలిగించేది. 38. క్రోధి… క్రోధాన్ని కలిగినది.
  10. విశ్వావసు… విశ్వానికి సంబంధించినది. 40. పరాభవ … అవమానం.
  11. ప్లవంగ… కోతి, కప్ప. 42. కీలక…. పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. 43. సౌమ్య… మృదుత్వం. 44. సాధారణ… సామాన్యం. 45. విరోధికృత్… విరోధాలను కలిగించేది. 46. పరీధావి… భయకారకం.
  12. ప్రమాదీచ… ప్రమాద కారకం. 48. ఆనంద… ఆనందమయం.
  13. రాక్షస… రాక్షసత్వాన్ని కలిగినది. 50. నల…. నల్ల అనే పదానికి రూపాంతరం. 51. పింగళ… ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
  14. కాలయుక్తి… కాలానికి తగిన యుక్తి. 53. సిద్ధార్థి… కోర్కెలు సిద్ధించినది.
  15. రౌద్రి… రౌద్రంగా ఉండేది. 55. దుర్మతి… దుష్ట బుద్ధి. 56. దుందుభి … వరుణుడు. 57. రుధిరోధ్గారి… రక్తాన్ని స్రవింప చేసేది.
  16. రక్తాక్షి… ఎర్రని కన్నులు కలది. 59. క్రోదన… కోప స్వభావం కలది.
  17. అక్షయ… నశించనిది. నిండుగా ఉండేది

More articles

Latest article