ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రుణపడి ఉంటాం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కళాకారుల గురించి మాట్లాడిన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లకు రుణపడి ఉంటామని నిరుద్యోగ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి కర్క రమేష్, కోశాధికారి గణేష్ లు అన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ఆంజనేయులు స్టూడియోలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలో కళాకారుల గురించి గళమెత్తడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో...