27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళ సాధికారత కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నాం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

మహిళ సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి తెలిపారు. బుధవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో టీఎన్జీవో భవన్ బి.స్వామినాథం సమావేశ మందిరం లో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం భూపతి రెడ్డి మాట్లాడుతూ టీఎన్జీవో ఆధ్వర్యంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించిన టీఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా ఉద్యోగ సోదరీమణులందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిలు, టీఎన్జీవో కళ్యాణమండపం కొరకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం టీఎన్జీవో జిల్లా కార్యాలయం లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మహమ్మదీయ మత పెద్దలు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక నమాజులు నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇరు కార్యక్రమాలకు టీఎన్జీవో మహిళ విభాగం సభ్యులు కేపీ సునీత, ఇందిర, విజయలక్ష్మి, గీతారెడ్డి, మంగమ్మ, శ్రీవేణి, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, చిట్టి నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు అతిక్ అహ్మద్, జాఫర్ హుస్సేన్, శివకుమార్, మాణిక్యం, పురుషోత్తం, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగరాజు, ప్రకాష్, నిరంజన్ గౌడ్, గురు చరణ్, లక్ష్మి నారాయణ, భూమయ్య, సునీల్, స్వామి, రవి, అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, శశికాంత్ రెడ్డి, విశాల్, ప్రవీణ్, సృజన్ కుమార్, సాయిలు, సూర్య ప్రకాష్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, క్లాస్ ఫోర్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేరెళ్ల శ్రీనివాస్, సర్దార్ వీరేందర్ సింగ్, వివిధ శాఖల పోరం అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల మహిళా ఉద్యోగ సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

More articles

Latest article