31.5 C
Hyderabad

సర్పంచులందరికి ఒక రోజు శిక్షణా కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విజయవంతం చేయాలని కోరిన ఎంపీడీఓ

 

జుక్కల్, బతుకమ్మ :

 

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీ సర్పంచులకు ఒకరోజు శిక్షణా, సమావేశ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ఆదేశించడం జరిగిందని జుక్కల్ ఎంపీడీఓ బి.శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ప్రాధాన్యత, ముఖ్య లక్ష్యాలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సర్పంచులందరికీ శిక్షణ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంద‌ని, జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ బి. శ్రీనివాస్ కోరారు.

More articles

Latest article