మహిళ సాధికారత కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నాం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మహిళ సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి తెలిపారు. బుధవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో టీఎన్జీవో భవన్ బి.స్వామినాథం సమావేశ మందిరం లో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు...