ఆర్మూర్, బతుకమ్మ : న్యాయమైన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని సివిల్ సప్లై హమాలీలు చేస్తున్న సమ్మె శుక్రవారం మూడవరోజు కూ చేరుకోవడం తో వంటవార్పు కార్యక్రమం నిర్వహించామని ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఆరెపల్లి సాయిలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2024 సంవత్సరం హమాలీలు చేసిన సమ్మె ఫలితంగా క్వింటల్ కూ 26 రూపాయలు ఉన్నా రెట్లను 29 రూపాయలకు పెంచుతు జీవో విడుదల చేయడం జరిగిందని జీవో అమల్లోకీ వచ్చి అరునెలలు కావస్తున్న పెంచిన రెట్లను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన రెట్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం. ఈ కార్యక్రమం లో మౌలానా, సోమా శ్రీను, నరేష్, కిష్టయ్య, పేరోజ్, రహీం, దుర్గం రాజేందర్, శ్రీకాంత్, పారశురాం, మల్లయ్య, నాదీమ్ తదితరులు పాల్గొన్నారు.
