ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ సిపిఎం పార్టీ శాస్త్రి నగర్ కార్యాలయంలో శుక్రవారం సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. 1848లో భర్తతో కలిసి అట్టడుగు కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించిందన్నారు. ఈ పాఠశాల నడపడం అగ్రవర్ణాల,కు నచ్చలేదనితెలిపారు. దాంతో ఆమెపై వేధింపులు భౌతిక దాడులకు పూనుకున్నారని అన్నారు. పాఠశాలకు వెళ్లే దారిలో ఆమెపై బురద చల్లారని తెలిపారు. కుల పిత్రు సౌమ్య వ్యవస్థను అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీ భూమన్న , ఎస్ కే రఫీ, అమీర్ ఖాన్, బి భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ ఆర్మూర్ పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్య పాల్గొన్నారు.
