27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పేద అమ్మాయి పెళ్లికి అండగా నిలిచిన 17వ వార్డు కౌన్సిలర్

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ప్రజా సేవలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు బాన్సువాడ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ ఫర్హానాజ్ అబ్దుల్ లయాక్. పట్టణ అధ్యక్షుడు సయీద్ ఖాన్ పర్యవేక్షణలో వార్డు అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో ఆమె దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, పేద కుటుంబాల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారు. వార్డులోని ఒక పేద యువతి వివాహానికి తన వంతు సహాయంగా 1 క్వింటాల్ బియ్యం, 5000 రూపాయల విలువైన కిరాణా సామగ్రిని కౌన్సిలర్ ఫర్హానాజ్ స్వయంగా అందజేశారు. ఇప్పటికే వార్డులో రెండోసారి ఇటువంటి సేవా కార్యక్రమం చేపట్టి పేదల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. పదవి అనేది ప్రజలకు సేవ చేసే అవకాశమని, వార్డులో ఏ పేద కుటుంబానికి కష్టం వచ్చినా అండగా ఉంటామని కౌన్సిలర్ ఫర్హానాజ్ స్పష్టం చేశారు. పేద అమ్మాయి పెళ్లికి అండగా నిలిచిన కౌన్సిలర్ తీరుపై స్థానికులు, పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అంజాద్ ఖాన్, హాశం, రసూల్, అస్లాం, ఎజాస్, సుభాన్, అబ్దుల్ హఫీజ్, వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article