. . . ప్రారంభించిన సర్పంచ్ ఆర్మూర్ లావణ్య
నవీపేట్, బతుకమ్మ :
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం నాళేశ్వర్ గ్రామంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా మాజీ సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు చిన్నదోడ్డి ప్రవీణ్,వి డి సి సభ్యులు జనార్దన్ రాజేందర్ సంజీవ్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్ముర్ లావణ్య మాట్లాడుతూ గత ఏడు సంవత్సరల నుంచి మహాశివరాత్రి సందర్భంగా నాళేశ్వర్ గ్రామంలో ప్రతి సంవత్సరం గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని క్రీడలతో మానసిక ఉల్లాసం తోపాటు శారీరక దారుఢ్యం మెరుగు పడతాయని అన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొన్న జట్లకు అభినందనలు తెలిపారు. మాజీ సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ,ఓటమి సహజమని ఓడిపోయిన వారు బాధపడకుండా రాబోయే రోజుల్లో గెలుపు దిశగా ఆటను మెరుగుపర్చుకోవాలన్నారు. ఈ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు మహ శివరాత్రి రోజునా బహుమతులను ఆందించడం జరుగుతుందన్నారు. యువజన ఆద్యక్షుడు చిన్నదోడ్డి ప్రవిణ్ మట్లాడుతూ గ్రామ స్థాయి టోర్నమెంట్ కు గ్రామబివృద్ది కమిటి, నాళేశ్వర్ ప్రజా ప్రతినిధుల సహయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు జనార్ధన్, రాజేందర్, సంజీవ్, గ్రామస్తులు,రమేష్ సతీష్ గోపి, సాయినాథ్, ప్రశాంత్, సూదాకర్, నవీన్, రవీందర్,సాయి తదితర యువకులు పాల్గొన్నారు.

