24.8 C
Hyderabad
Friday, July 31, 2026

కార్పొరేషన్ లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం 

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

 

. . . బీఆర్ఎస్ కార్పొరేటర్ ను ఎత్తుకు రావడానికి ఏసిపి, ఎస్ఐ లు ఎందుకు ?

 

. . . విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ 40 శాతం మైనార్టీలు ఉన్నా బిజెపికి 28 సీట్లు రావడం గర్వకారణం అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పట్టారన్నారు. ఇందూరు ప్రజలకు బిజెపి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ కార్పొరేటర్ ను ఇంటి నుంచి ఎత్తుకు రావడానికి ఏసిపి, ఎస్ ఐ లు ఎందుకు అని వారికి అందుకే జీతాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని అన్నారు. నా మీద కేసు పెట్టడం కాదు నేనే పోలీసులపై కేసు పెడుతానని, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తారా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్, ఎంఐఎం ఒకటేనని తాము ముందు నుంచి ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కోర్టులను క్షమించేది లేదని అరవింద్ హెచ్చరించారు. సాంకేతికంగా తాము ఓడినా బీజేపీ పెరిగిందన్నారు. మున్సిపల్ కాలపరిమితి ముగిసే లోగా ఇందూర్ పేరు మారడం ఖాయమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తదితరులున్నారు.

More articles

Latest article