24 C
Hyderabad
Sunday, August 2, 2026

చొక్కాయగుట్ట అయ్యప్ప ఆలయ సంప్రోక్షణం

Must read

📰 Generate e-Paper Clip

  • ఘనంగా కుంభాభిషేకం, మహా పడి పూజ
  • తంత్ర వ్యాసములచే ప్రతిష్టపన, హోమాల నిర్వహణ

 

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్ర శివారులోని చొక్కయ్యగుట్టపై వెలసిన హరిహర సుతుడు అయ్యప్ప క్షేత్ర సంప్రోక్షణ కార్యక్రమంను గురువారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.శబరిమళ తాంత్రి బ్రహ్మశ్రీకంఠరారు మహేశ్వరన్ మొహారన్, స్థానిక వేద పండితులు నంబీ వాసుదేవ పరియవేక్షణలో తంత్ర విన్యాసాలు, వేద మంత్రాల నడుమ ఈ సంప్రోక్షణం, కుంభభిషేకం, మహాపడి పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. ఈ మహా సంప్రోక్షణ, కుంభభిషేక క్రతువులో భాగంగా తాంత్రి,అర్చకులు ఉదయం 5.30 కి గణపతి హోమం, 10 గంటలకు అయ్యప్ప స్వామి గర్భలయంలో ప్రత్యేక తంత్రి పూజలు, వేద బ్రాహ్మణులచే హోమాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాత్రి 6.30 కు తాంత్రిచే శ్రీఅయ్యప్ప మహాపడి కార్యక్రమంను వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భజన కార్యక్రమం, హరివరాసనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అయ్యప్ప సేవా సమితి కార్యవర్గం, సభ్యులు, దాతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Visit to Chokkayagutta Ayyappa Temple

More articles

Latest article