27.2 C
Hyderabad

13న ఊర పండగ

Must read

📰 Generate e-Paper Clip

  • సర్వ సమాజ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యేండల లక్ష్మీనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి యేటా ఆషాడ మాసంలో నగరంలో నిర్వహించే ఊర పండగ ఈనెల 13న నిర్వహించనున్నట్లు సర్వ సమాజ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యేండల లక్ష్మీనారాయణ తెలిపారు. నగరంలోని సిర్నాపల్లి గడిలో పండుగ సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊర పండుగను పురస్కరించుకొని నగరంలోని ఖిల్లా చౌరస్తా  నుంచి పెద్దబజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామదేవతల ఊరేగింపు ఉంటుందన్నారు. మరో గ్రామ దేవత దుబ్బ వైపు తరలి వెళ్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్​లోని అన్ని కుల సంఘాల సభ్యులు పండుగలో పాలు పంచుకుంటారని.. గురువారం బండారు వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సర్వ సమాజ్​ కమిటీ ప్రతినిధులు బంటు రాము, ఆదె ప్రవీణ్, కమిటీలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

More articles

Latest article